IPLలో ధోనీ సరికొత్త రికార్డు..

by Anukaran |
IPLలో ధోనీ సరికొత్త రికార్డు..
X

దిశ, స్పోర్ట్స్: IPL 13వ సీజన్ తొలి మ్యాచ్‌లో ముంబై జట్టుపై చెన్నై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, ఈ మ్యాచ్ గెలవడం ద్వారా మహేంద్ర సింగ్ ధోనీ(Mahendra singh dhoni) సరికొత్త రికార్డు(New record)సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో 100 మ్యాచ్‌లు గెలిపించిన (100 Matches won as captain) ఏకైక కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు.

ధోనీ ఇప్పటి వరకు 161 మ్యాచ్‌లలో చెన్నై జట్టుకు (Csk team) నాయకత్వం వహించగా అందులో 100 విజయాలు నమోదు చేశాడు. ధోనీ తర్వాతి స్థానంలో గౌతమ్ గంభీర్ (Goutham gambir)(61), రోహిత్ శర్మ(Rohith sharma) (60), విరాట్ కొహ్లీ (Virat kohli)(49) ఉన్నారు. విజయాల శాతంలో కూడా ధోనీనే అగ్రస్థానంలో ఉన్నాడు.

అతడి విజయాల శాతం 62 ఉండగా.. ఆ తర్వాత సచిన్ టెండుల్కర్ (Sachin tendulkar)(57.69), యువరాజ్ సింగ్ (Yuvraj singh) (58.62), డేవిడ్ వార్నర్ (David warner) (57.82)లు ఉన్నారు. విరాట్ కొహ్లీ విజయాల శాతం 44గా ఉన్నది. 22న షార్జా క్రికెట్‌ స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్‌తో చెన్నై తదుపరి మ్యాచ్ ఆడనుంది.

Advertisement

Next Story

Most Viewed