- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధోనీ చాలా మారిపోయాడు: పఠాన్
దిశ, స్పోర్ట్స్: టీం ఇండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి ధోనీకి, ఆ తర్వాత ధోనీకి చాలా మార్పు వచ్చిందని మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ చెప్పాడు. భారత జట్టుకు 2007లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు ధోనీ చాలా ఉత్సాహంగా ఉండేవాడనీ, జట్టు సమావేశాలు కూడా 5 నిమిషాల్లోనే పూర్తయ్యేవని ఇర్ఫాన్ వివరించాడు. స్టార్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్న క్రికెట్ కనెక్టెడ్ అనే కార్యక్రమంలో పాల్గొన్న ఇర్ఫాన్ పలు విషయాలు వెల్లడించాడు. ‘కెప్టెన్సీ చేపట్టిన కొత్తలో కంటే 2013కు వచ్చేసరికి ధోనీలో ఎంతో పరిపక్వత వచ్చింది. మొదట్లో జట్టులోని ప్రతి ఆటగాడూ తన ఆధీనంలోనే ఉండాలని కోరుకున్నాడు. కానీ ఆ తర్వాత బౌలర్లకు స్వేచ్ఛను ఇచ్చాడు. దీంతో వారిలోనూ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. స్పిన్నర్లు, స్లో బౌలర్లకు ఎప్పుడు బౌలింగ్ ఇచ్చినా వికెట్లు తీసేలా ధోనీ రూపొందించాడు. ఈ వ్యూహాలన్నీ 2013 చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలబడటానికి పనికొచ్చాయి’ అని పఠాన్ చెప్పుకొచ్చాడు. ధోనీ 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టును విజేతగా నిలిపి మూడు ఐసీసీ ఈవెంట్లు గెలిచిన భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. కాగా, 2011 మినహా మిగతా రెండు టోర్నీల్లోనూ భారత జట్టులో ఇర్ఫాన్ పఠాన్ సభ్యుడిగా ఉన్నాడు.