- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2023లో కేసీఆర్ దొరపాలన అంతం : మందకృష్ణ
దిశ ప్రతినిధి, వరంగల్:
వచ్చే 2023 ఎన్నికల నాటికి కేసీఆర్ రూపంలో నడుస్తున్న దొరలపాలన అంతం కాబోతోందని ఎమ్మార్పీఎస్ వ్వవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ అన్నారు. గురువారం వరంగల్ హంటర్ రోడ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2003లోనే తల్లి తెలంగాణా పుస్తకంలో దళితులను మోసం చేసి ముఖ్యమంత్రి అవుతాడని రాసినట్లు ప్రకటించారు. నిండు అసెంబ్లీలో తాను దొరనే అని బాహాటంగా ప్రకటించిన కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్ని రాజకీయ పార్టీలు కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం ఇంతవరకు స్పందించడం లేదని విమర్శించారు. లోటు బడ్జెట్‌లో ఉన్న ఏపీ ప్రభుత్వం కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చిందని, మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. కేసీఆర్ మాటను ధిక్కరించి.. కరోనా సోకిన ఎమ్మెల్యేలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని మందకృష్ణ మండిపడ్డారు. రాజకీయంగా కేసీఆర్ భారీ మూల్యం చెల్లించే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పుకొచ్చారు. ఆరేండ్ల కేసీఆర్ పాలనలో దళిత గిరిజన వర్గాలకు భూ పంపిణీ ఎందుకు జరగడం లేదని మందకృష్ణ ప్రశ్నించారు.