- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసలైన ఉద్యమకారులు ఎప్పుడైనా జెలుకెళ్లారా..? : మందకృష్ణ
దిశ, నాగార్జునసాగర్ : ప్రశ్నించే గొంతుక చెరుకు సుధాకర్ అని, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఆయన్ను గెలిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. నాగార్జన్‌సాగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల నాయకులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వృత్తి రీత్యా డాక్టర్ అయిన ఆయన రూ.10కే వైద్యం చేస్తూ పేదల డాక్టర్‌గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంచి పేరు సంపాదించుకున్నారని తెలిపారు.
టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం అతడు ఉద్యమించాడని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తరువాత తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన కీలక వ్యక్తుల్లో ఆయన ఒకరన్నారు. జైలు జీవితం సైతం గడిపారని తెలిపారు. కానీ అసలైన ఉద్యమాకారులం తామేనని చెప్పుకుంటున్న కేసీఆర్, హారీశ్‌రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావు తెలంగాణ ఉద్యమంలో ఏనాడైనా జైలు శిక్ష అనుభవించారా అని ప్రశ్నించారు. స్వతంత్ర్య అభ్యర్థి చెరుకు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పల్లాకు ఓటు వేస్తే యావత్ తెలంగాణకే ప్రమాదమన్నారు. అతనికి టికెట్ ఇవ్వడం, తిరిగి పోటీకి నిలబెట్టడం నీతిమాలిన చర్యగా అభివర్ణించారు. తనను గెలిపిస్తే సమస్యలపై మండలిలో గొంతు వినిపిస్తానన్నాడు. కార్యక్రమంలో ఏపూరి సోమన్న, శ్రీనివాస్, రవీందర్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.