బీచ్‌లో మొక్కలు నాటిన విజయసాయి రెడ్డి

by srinivas |
బీచ్‌లో మొక్కలు నాటిన విజయసాయి రెడ్డి
X

దిశ, ఏపీ బ్యూరో : విశాఖ ఆర్కే బీచ్‌లో అలల తాకిడికి భూమి కోతకు గురవకుండా ఉండేందుకు జీవీఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సన్‌ రే రిసార్ట్స్‌తో కలిసి స్కేవోలా టకాడా మొక్కలు నాటే ప్రక్రియను మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. నౌపాక మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయని అన్నారు. బీచ్‌లో మొక్కలు నాటడం ఆనందంగా ఉందని వివరించారు. వైజాగ్‌లో ఉష్ణోగ్రత తగ్గేందుకు ఈ మొక్కలు దోహద పడతాయన్నారు. విశాఖ నగరంలో 2 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించినట్లు చెప్పారు. మంత్రి అవంతి మాట్లాడుతూ.. వైజాగ్ పర్యాటకులకు స్వర్గధామం అన్నారు. రాబోయే రోజుల్లో నౌపాక మొక్కలు పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలను పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారని తెలిపారు.

Advertisement

Next Story