టీడీపీ నేతలపై ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు

by srinivas |
టీడీపీ నేతలపై ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు
X

దిశ, విశాఖపట్నం: టీడీపీ హయాంలో మంత్రులుగా పని చేసిన గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యేలు బండారు, వెలగపూడి, గణబాబు, పీలా గోవింద్ రికార్డులు మార్చి ప్రభుత్వ భూములను కొట్టేశారని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. గురువారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భూ యజమానికి తెలియకుండా భూములను అమ్మేశారని పేర్కొన్నారు. వీటిపై ప్రభుత్వం నియమించిన సిట్‌ రిపొర్ట్‌ త్వరలోనే బయటకు వస్తుందని, భూకబ్జాలకు పాల్పడిన వారికి శిక్ష తప్పదన్నారు. ప్రభుత్వ భూములను అక్రమిస్తే ఎంతటి వారినైనా ఊపేక్షించేది లేదన్నారు.

Advertisement

Next Story

Most Viewed