ఫోరెన్సిక్‌ వర్సిటీని స్థాపించండి..

by srinivas |
ఫోరెన్సిక్‌ వర్సిటీని స్థాపించండి..
X

దిశ, ఏపీబ్యూరో :

ఏపీలో ఫోరెన్సిక్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు విన్నవించారు. నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్ యూనివర్శిటీ బిల్లుపై రాజ్యసభ చర్చలో చర్చ సందర్భంగా ఆయన కోరారు. దేశంలో నేరాలు జరిగే తీరు, క్రైం దర్యాప్తు, వాటి వెనుక కారణాలను విశ్లేషించడంలో ఇలాంటి యూనివర్శిటీ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు.

నేరాలు కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కానందున పోలీసుల నేర పరిశోధనలో సహకరించేందుకు ప్రతి రాష్ట్రంలో గుజరాత్‌లో మాదిరిగా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని వివరించారు.హైదరాబాద్‌లో ఫోరెన్సిక్‌ లాబరేటరీ ఉన్నందున ఏపీలో కూడా ఫోరెన్సిక్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తే బావుంటుందనే విషయాన్ని ఆయన కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed