కోలుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి

by srinivas |
కోలుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ :
కరోనా బారిన పడిన వైసీపీ కీలకనేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఎట్టకేలకు కోలుకున్నారు. గత వారం రోజుల కిందట తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ట్విట్టర్‌లో పేర్కొన్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ వచ్చింది. దీంతో ఆయన్ను నిన్న సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. మరోవారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు ఎంపీ వెల్లడించారు. కాగా, విజయసాయి రెడ్డి పీఏకు కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed