‘అమరావతి అభివృద్ధికొచ్చిన నష్టమేమి లేదు’

by srinivas |
‘అమరావతి అభివృద్ధికొచ్చిన నష్టమేమి లేదు’
X

దిశ, వెబ్‌డెస్క్: వికేంద్రీకరణ బిల్లు ద్వారా అమరావతి అభివృద్ధికొచ్చిన నష్టమేమీ లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. రాజధాని అంశంపై తాజాగా ట్వీట్ చేసిన ఆయన.. సీఎం జగన్ ఎఎమ్‌ఆర్‌డీఏ సమీక్ష చూస్తే నష్టమేమీ లేదని అర్థమవుతోందన్నారు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని ఆయన భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మాత్రం ఎవరూ హామీలివ్వలేరు అంటూ ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారు.

Advertisement

Next Story