మీ ఉడుత ఊపులు నా దగ్గర కాదు

by srinivas |
MP Raghu Ramakrishnam Raju
X

దిశ, ఏపీ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. తనపై వైసీపీ ఎంపీలు, నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. చివరకు బెదిరింపులకు సైతం పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తన అంతు చూస్తా అన్నారని బెదిరించారని చెప్పుకొచ్చారు. తనను తిట్టినందుకు వైసీపీ నాయకత్వం ఆయనను అభినందించినట్లు తనకు తెలిసిందన్నారు. ప్రెస్ మీట్ పెడితే లేపేస్తారా అంటూ ప్రశ్నించారు.

పిచ్చి ఉడుత ఊపులు ఉపకుండి. తాను చేస్తోంది ధర్మపోరాటం అని చెప్పుకొచ్చారు. మరోవైపు విశాఖ ఉక్కుపై టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తామనడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. తాను కూడా రాజీనామాకు రెడీ అని చెప్పుకొచ్చారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం వైసీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసేందుకు సిద్ధం కావాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించాలని సూచించారు.

సజ్జల విశృంఖలత్వంగా వ్యవరిస్తున్నారు

అమరరాజా కంపెనీ తరలిపోవడంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ చేస్తున్న వ్యాఖ్యలకు పొంతన లేదని చెప్పుకొచ్చారు. ఇద్దరు నేతలు చెరోమాట మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ఆర్‌ అమరరాజా కంపెనీకి అదనపు భూకేటయింపులు చేశారని చెప్పుకొచ్చారు. అప్పుడు కనిపించని తప్పులు ఇప్పుడు ఎలా కనిపించాయో అర్థం కావడం లేదన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని శాఖలలో వేలుపెడుతున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ శాఖలోని సమస్య అయినా సజ్జలే మాట్లాడతారా అని ప్రశ్నించారు. సజ్జల విశృంఖలత్వంగా వ్యవరిస్తున్నారని ఎంపీ రఘురామ విమర్శించారు.

Next Story

Most Viewed