- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్ని ఎత్తుగడలు వేసినా.. నన్ను ఆపలేరు: ఎంపీ అరవింద్
దిశ, ఇందల్వాయి: ఇందల్వాయి మండల కేంద్రంలోని గన్నారం గ్రామంలో తెరాస పార్టీ నాయకుల నిరసనల మధ్య ఎంపీ అరవింద్ పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం గన్నారం గ్రామం లోని సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం బీజేపీని కానీ, నన్ను ఏమీ చేయలేరని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు ధన్యవాదాలంటూ ఎద్దేవా చేశారు. గన్నారం గ్రామాన్ని దేశం మొత్తం తలపించే విదంగా చేశారని అన్నారు.
గన్నారం గ్రామ సచిలయ కార్యాలయానికి 10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గన్నారం గ్రామ సర్పంచ్ ను కేంద్ర రాష్ట్ర మంత్రితో కల్పిస్తానన్నారు. హైవే రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి జాబితా తమ దృష్టికి వచ్చిందన్నారు. వారి కుటుంబాలకు త్వరలోనే ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రంలో రూరల్ ఇంచార్జి దినేష్, డిచిపల్లి ఎంపీపీ భూమన్న, నాయిడి రాజన్న, గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ బైరయ్య, కేపీ రెడ్డి, శ్రీనివాస్, రజినీకాంత్, తదితరులు పాల్గొన్నారు.