ఓవైసీపై బండి సంజయ్ కౌంటర్

by Anukaran |   ( Updated:2020-07-29 06:33:04.0  )
ఓవైసీపై బండి సంజయ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో, ప్రధానిపై అసదుద్దీన్ ఓవైసీ చవకబారు విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బండి సంజయ్ అన్నారు. ఆగస్టు 5 న జరిగే భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని ముఖ్యఅతిథిగా హాజరై, శంకుస్థాపన చేస్తారని ఆయన గుర్తు చేశారు.

దీనిపై హైదరాబాద్ ఎంపీ, అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని మండిపడ్డారు. అన్ని మతాలను సమానంగా గౌరవించడమే సెక్యులరిజమని సంజయ్ చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల ఆకాంక్ష మేరకు.. ప్రధాని రామమందిర శంకుస్థాపనకు వస్తున్నారని స్పష్టం చేశారు. ఈ ఆలయం కేవలం హిందూ మతస్తులకు చెందింది కాదని, ఇది భారతీయుల ఆలయంగా ఆయన అభివర్ణించారు.

కోట్లాది మంది ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన ఈ మహాయజ్ఞ ప్రారంభ కార్యక్రమంలో మోదీ పాల్గొనడం భారతీయులందరికీ గర్వకారణమన్నారు. 400 ఏళ్లుగా అయోధ్యలో బాబ్రీ మసీదు ఉందనడం నిజమైతే, మరీ అంతకుముందు వేల ఏళ్లుగా అక్కడున్న శ్రీరామ మందిరంను మరి ఎవరు ధ్వంసం చేశారని బండి సంజయ్ ప్రశ్నించారు. సుప్రీం కోర్టు తీర్పు తదనంతరం, భారత ప్రభుత్వం కోర్టుకు నివేదించిన మేరకు, ఎటువంటి సమస్యలు లేకుండా, అందరిని కలుపుకుంటూ, ఆమోదయోగ్యంగా, శాంతియుతంగా ఈ ఆలయ నిర్మాణం జరుగుతున్నదని బండి సంజయ్ ఓవైసీకి ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed