- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేటీఆర్ నీకు సిగ్గుంటే రాజీనామా చెయ్.. ప్రధానితో మాట్లాడి నిరూపిస్తా..!
దిశ ప్రతినిధి,నిజామాబాద్ : గత ఏడేళ్లలో తెలంగాణ పన్నుల రూపేణా రూ.2.72 లక్షల కోట్లు చెల్లిస్తే కేంద్రం రూ.1.46 లక్షల కోట్లు మాత్రమే చెల్లిస్తూ తెలంగాణపై వివక్ష చూపుతోందని, ఇది తప్పయితే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నానంటూ రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పందించారు. కేటీఆర్ తన సవాల్‌కు కట్టుబడి ఉంటే ప్రధాన మంత్రి మోడీ అపాయింట్మెంట్ తీసుకుని కేంద్రం ఇచ్చిన ప్రతిపైసా లెక్కలు తెలుస్తానని ప్రజా సంగ్రామ యాత్రలో బండి స్పష్టంచేసారు. గురువారం కామారెడ్డి జిల్లా బంజారా తండాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. గత ఏడేళ్లలో పన్నుల వాటా, ప్రాయోజిత పథకాల, జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే, ఫ్రీ వ్యాక్సిన్ పేరిట ఇప్పటివరకు రూ.2 లక్షల 52 వేల కోట్లు కేంద్రం తెలంగాణకు ఇచ్చిందన్నారు. ఇవి కేవలం ఐదు అంశాల్లో మాత్రమే ఇచ్చినవి అని, దేశ రక్షణ, విమానాయాన, శాటిలైజ్ నిర్వహణ, జాతీయ విపత్తు వంటి అంశాల్లో కేంద్రం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. సవాల్ విసిరిన మంత్రికి ఏ మాత్రం సిగ్గున్నా రాజీనామా చేసి తీరాలని ప్రతి సవాల్ విసిరారు. తెలంగాణకు నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతుంటే టీఆర్ఎస్ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో ఇవే ప్రశ్నలు అడిగితే చట్టసభల సాక్షిగా టీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్దాల బండారం బయటపడుతుందన్నారు.
గత నెల 28న మొదలైన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ప్రజలు కష్టాలు చెప్పుకుంటున్నారు. వారిలో భరోసా నింపే యత్నం చేస్తున్నానని చెప్పారు. ప్రజల బాధలు, కష్టాలు చూస్తుంటే టీఆర్ఎస్ పట్ల ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమవుతోందన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని బీజేపీ మొదటి నుండి డిమాండ్ చేస్తుందన్నారు. అధికారంలోకి రాకముందు ఒక వాదన, వచ్చాక మరో వాదన టీఆర్ఎస్ నైజం అన్నారు . ఈసారి నిర్మల్ సభకు కేంద్ర హోంమంత్రి, స్పూర్తి ప్రదాత అమిత్ షా నాందెడ్ నుండి నిర్మల్ వస్తున్నారని చెప్పారు. రజాకార్ల ఆధ్వర్యంలో ఒకేసారి వెయ్యి మందిని నిర్మల్‌లో ఉరితీశారని, అక్కడ శుక్రవారం 12 గంటలకు బహిరంగ సభ ప్రారంభమవుతుందన్నారు. పెద్ద ఎత్తున జనం, కార్యకర్తలు ఉదయం 7 గంటలకు జాతీయ జెండాలు ఎగురవేసి వెంటనే నిర్మల్ రావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
తెలంగాణను దివాళా తీయించి, జీతాలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలోకి నెట్టి, కుటుంబ ఆదాయాన్ని మాత్రం కేసీఆర్ పెంచుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణకు జరిగే అన్యాయం గురించి ఆలోచించని వ్యక్తి కేసీఆర్ అని.. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో అన్యాయం చేస్తున్నది కూడా కేసీఆర్ అని మండిపడ్డారు. మోదీని చూస్తే సర్దార్ పటేల్, కేసీఆర్‌ను చూస్తే నిజాం గుర్తుకు వస్తున్నారని చెప్పారు. తెలంగాణలో 90 శాతం రైతులు అప్పుల పాలు అయ్యారు. ఇందులో 40 శాతం మంది ప్రైవేటు వాళ్ల నుంచి అప్పులు తీసుకుని, వడ్డీలు చెల్లించలేక అల్లాడుతున్నారని వివరించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు అరుణ తార, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, హన్మకొండ అర్బన్ ఇంచార్జి, కాటేపల్లి మాజీ జడ్పీ ఛైర్మన్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు జె.సంగప్ప, జిల్లా ఇంచార్జి మహిపాల్ రెడ్డి బద్దం, జిల్లా నాయకులు నీలం చిన్నరాజులు, బాపు రెడ్డి వేణుగోపాల్ గౌడ్, హనుమాండ్లు తదితరులు ఉన్నారు.