రైతుబంధు పథకంపై ఎంపీ అర్వింద్ షాకింగ్ కామెంట్స్

by Sridhar Babu |
Nizamabad-MP-Dharmapuri-Arv
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: రైతుబందు పథకంలో 70 శాతం భూ బకాసురులకే లాభం జరుగుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా పోరండ్లలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌలు రైతులకు సాయం సాయం చేయడం లేదన్నారు. మొక్క జొన్నకు ఎలాంటి సాయం చేయడం లేదని, కేంద్రం నిధులు ఇస్తోందన్నారు. పెన్షన్లకు సాంప్రాదాయం కోసం అన్నట్టుగా రూ. 16 కలిపాడు కానీ ఎవరికీ పెన్షన్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఓవైసీ కాళ్ల వద్ద కేసీఆర్ మొకరిల్లారని.. అటువంటి వ్యక్తి వద్ద కుక్కలా పడి ఉండే వ్యక్తి మంత్రి ప్రశాంత్ రెడ్డి అంటూ అర్వింద్ ఘాటుగా వ్యాఖ్యానించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి కోసం కేంద్రం రూ. 30 కోట్లు ఇచ్చినా రాష్ట్రం వాటా మాత్రం ఇవ్వలేదన్నారు. పసుపు రైతులకు గిట్టుబాటు గురించి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని కేంద్రం అడిగినా స్పందించడం లేదని అరవింద్ దుయ్యబట్టారు.

Advertisement

Next Story

Most Viewed