- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ దివాళాకోరుతనం వల్లే నిధులకు బ్రేక్
దిశ, సంగారెడ్డి: తెలంగాణ సీఎం కేసీఆర్ దివాళాకోరుతనం వల్లనే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతున్నాయని ఎంపీ అరవింద్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సందర్బంగా.. సోమవారం రాత్రి సదాశివపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 2016-17లో గ్రామ పంచాయతీలకు రూ.66 కోట్ల నిధులు మంజూరు చేసి మొదటి విడతగా కేంద్ర ప్రభుత్వం రూ.17 కోట్లు విడుదల చేసిందని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. 2020-21 వరకు ఆ 17 కోట్ల రూపాయల లెక్క రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేదన్నారు. ఈ కారణం వల్లనే కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సిన 950 కోట్ల రూపాయల నిధులు ఆగిపోయాయని, ఈ విషయాన్ని సర్పంచ్ లు గుర్తించాలన్నారు. దీన్ని బట్టే కేసీఆర్ దివాళాకోరుతనం బయట పడుతుందన్నారు.
రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, ఇతర పెద్ద మనుషులు ఉచిత కరెంట్ ఇస్తున్నామంటూ ప్రగల్బాలు పలుకుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కరెంట్ కోసం లాక్షా పదివేల కోట్ల అప్పులు చేసిందని, రాష్ట్రంలో ఒక్క యూనిట్ విద్యుత్ ను కూడా ఉత్పత్తి చేయలేకపోయారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఇళ్ల నిర్మానానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిధులిస్తే, వాటిని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.
- Tags
- mp aravind
- KCR
- KCR