- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘జరిగింది మీకు కొంతే తెలుసు’.. కళ్యాణ్ దేవ్ పోస్ట్
దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ ఆమె భర్త కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇంతవరకు అధికారికంగా ఈ విషయంపై శ్రీజ, కళ్యాణ్ దేవ్ స్పందించలేదు. కళ్యాణ్ దేవ్, శ్రీజలు వేర్వేరుగా ఉంటున్నారని వీరికి పుట్టిన పాప నవిష్క కోసం అప్పుడప్పుడు కలుస్తున్నట్టు సమాచారం. అయితే ఇటీవల కళ్యాణ్ దేవ్ తన పాప నవిష్కను మిస్ అవుతున్నట్టు ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టడంతో విడాకుల వార్తలకు బలం చేకూరినట్లైంది. తాజాగా, కళ్యాణ్ దేవ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేశాడు. ‘ ఇతరుల పట్ల ఎందుకు అంత దయ, జాలి చూపించాలంటే.. వారు ఎదుర్కొంటున్న కష్టాలు, పడుతున్న బాధల గురించి మనకు తెలిసింది గోరంత తెలియనిది కొండంత. అందుకే ఎదుటి వారి పట్ల మనం జాలిని చూపించాలి’’ అనే అర్థం వచ్చేలా ఓ కొటేషన్‌ను షేర్ చేశాడు. కళ్యాణ్ దేవ్ జీవితంలో ఏం జరుగుతుందో తెలియకుండానే జనాలు ఇష్టమొచ్చినట్టుగా కామెంట్ల చేస్తుంటారని కళ్యాణ్ దేవ్ ఆ పోస్ట్ షేర్ చేసినట్లు నెటిజన్లు అనుకుంటున్నారు.
- Tags
- Kalyan Dev'