- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vishnupriya: అప్పుడేమో వెళ్లనని.. ఇప్పుడు ఆ లక్షల కోసం వెళ్లావా..! విష్ణుప్రియపై నెటిజన్ల సెటైర్లు
దిశ, వెబ్ డెస్క్ : తెలుగు బుల్లి తెర ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 ఆదివారం సాయంత్రం గ్రాండుగా లాంచ్ చేసారు. ఈ సీజన్లో సోలో ఎంట్రీ లేదంటూ బిగ్ బాస్ అందరికి షాక్ ఇచ్చారు. సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ అందర్ని ఆకట్టుకున్నారు. మరి ఈ సారి కపుల్స్ తో ఆట ఎలా ఉంటుందో చూడాలి. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్ విష్ణు ప్రియాను నెటిజెన్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం..
బుల్లితెరపై తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న వారిలో విష్ణు ప్రియా కూడా ఒకరు. ఈమె ముద్దు ముద్దు మాటలకి ఎవరైనా పడి పోవాల్సిందే. సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసి తన అందాలతో కురాళ్లను కట్టిపడేసింది. సుడిగాలి సుధీర్ తో కలిసి పోవే పోరా అనే షో చేసింది విష్ణు ప్రియా. ఈ షో చాలా పెద్ద హిట్ అయింది.
సోషల్ మీడియాలో కూడా మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు అదే క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, గతంలో ఈ బ్యూటీ బిగ్ బాస్ షో కి వెళ్లడం పై షాకింగ్ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ షోలో అవకాశం వస్తే వెళ్తారా అని అడిగితే.. నేను కోట్లు ఇచ్చిన అక్కడికి మాత్రం వెళ్ళను.. ఒకే ఇంట్లో వందరోజులు ఎలా ఉంటాం బాబోయ్ నేను ఉండలేను.. నేను వెళ్ళను.. అని కామెంట్స్ చేసింది. కట్ చేస్తే బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళింది. అప్పుడేమో వెళ్లనని.. ఇప్పుడు ఆ లక్షల కోసం వెళ్లావా.. అంటూ విష్ణుప్రియపై సైటైర్లు వేస్తున్నారు.