పెళ్లై పదేళ్లు దాటుతున్న .. ఉపాసన-చరణ్ ఆ విషయాల్లో సపరేట్ గానే ఉంటారా? బయటపడ్డ అసలు నిజం

by Anjali |   ( Updated:2023-11-14 12:59:12.0  )
పెళ్లై పదేళ్లు దాటుతున్న .. ఉపాసన-చరణ్ ఆ విషయాల్లో సపరేట్ గానే ఉంటారా? బయటపడ్డ అసలు నిజం
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి సుపరిచితమే. ప్రస్తుతం చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమాలో నటిస్తున్నారు. తర్వాత సుకుమార్, ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్.. వంటి బడా డైరెక్టర్ల దర్శకత్వంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను వరుసగా లైన్లో పెట్టుకుని ఉన్నారు. సినిమాల విషయం పక్కన పెడితే..

ఈ చరణ్ సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఫ్యామిలీకి అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకొన్న విషయం తెలిసిందే. ఇటీవలే అపోలో ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీ మొత్తం సంబరాలతో నిండిపోయింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. అయితే చరణ్-ఉపాసన పెళ్లై పదేళ్లు దాటుతోన్న డబ్బుల విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఎవరి సంపాదన వారిదేనట.

అలాగే ఎవరు ఎలాంటి సోషల్ సర్వీస్ చేయాలన్న వాళ్ల మనీతోనే చేస్తారట. ఒకరు డబ్బులు మరొకరు ఖర్చు ఖర్చు పెట్టుకోవడం లాంటివి అస్సలు చేయరట. చరణ్, ఉపాసన డబ్బుల విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా లెక్కలను ఫాలో అవుతారట. దీంతో నెటిజన్లు.. ‘వేల కోట్ల ఆస్తి ఉన్నా ఇలాంటి అలవాట్లు ఉండటమేంటి? అని కామెంట్స్ చేస్తున్నారు. మెగా ఫాన్స్ మాత్రం రూపాయి విలువ తెలిసిన వాళ్ళే ఇలాంటి నియమాలు పెట్టుకుంటారు అంటూ మనీ విషయంలో ఉపాసన – చరణ్ రియల్లీ గ్రేట్ అంటూ ఆకాశనెత్తుతున్నారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story