Mahesh Babu: భారీగా పెరిగిన ప్రిన్స్ మహేష్‌ బాబు ఆస్తుల విలువ.. ఎంతంటే..?

by Kavitha |
Mahesh Babu: భారీగా పెరిగిన ప్రిన్స్ మహేష్‌ బాబు ఆస్తుల విలువ.. ఎంతంటే..?
X

దిశ, సినిమా: ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇతని సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. గత కొన్నేళ్ల నుంచి మహేష్ బాబు వరుస విజయాలను సొంతం చేసుకుంటూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘SSMB 29’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నాడు మహేష్ బాబు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు నికర ఆస్తి విలువ పెరిగినట్టు తెలుస్తుంది. ఆ వివరాలను ఒకసారి చూసినట్లయితే.. సినిమాలతో పాటు వ్యాపార పరంగా కూడా మంచి పేరు తెచ్చుకున్న ప్రిన్స్ మహేష్ బాబుకు గచ్చిబౌలిలో ఏడు తెరలు ఉన్న మల్టీప్లెక్స్ (ఏఎంబీ), జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ పేరుతో సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ఉన్నాయి. అలాగే ఇతను సినిమాలతో పాటు యాడ్స్ కూడా చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రతి ప్రకటనకు ఆయన రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటారు. అలా ఇప్పటివరకు ఆయన 51 ప్రకటనలు చేశారు. ఇక ఒక సినిమాకు రూ.80 నుంచి రూ.100 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు. కాగా వీటిని వ్యాపారాల్లో పెట్టుబడిగా పెడుతున్నారు. పద్మాలయ స్టూడియోతో పాటు హైదరాబాద్‌లో రూ.40 కోట్ల విలువచేసే బంగ్లా, ఇటీవలే బెంగళూరులో కొనుగోలు చేసిన ఇల్లు ఉన్నాయి. ఇలా అన్నీ కలిపితే ప్రస్తుతం మహేష్ బాబు ఆస్తి విలువ రూ.1300 కోట్లుగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ ఆస్తి విలువలో పద్మాలయ స్టూడియోను మినహాయించారు.

కాగా ప్రతి సంవత్సరం తన సంపాదనలో రూ.25 కోట్లను చిన్నారుల గుండె ఆపరేషన్లకు కేటాయిస్తుండగా, మరో 30 శాతాన్ని స్వచ్ఛంద సంస్థలకు అందజేస్తున్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయకుండా ఉంటే ప్రిన్స్ ఆస్తి ఇంకా భారీగా ఉండేది.

Advertisement

Next Story