- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏంటీ..! బ్రహ్మానందం భార్య.. ఈ ఫేమస్ జబర్దస్త్ నటి అమ్మానా?
దిశ, సినిమా: హాస్య నట బ్రహ్మ బ్రహ్మానందం గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. కొన్ని వందల సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ప్రేక్షకులు పడీ పడీ నవ్వుతారు. ఈయన కేవలం ఒకటి, రెండు సినిమాలతో కాదు చేసిన అన్ని సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో కలిసి కూడా ఎన్నో మూవీస్‌లో నటించి మెప్పించాడు. అందులో ముఖ్యంగా వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘పెద్దరాయుడు’ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీలోని పాటలు, ఎమోషనల్ సీన్స్, కామెడీ ఇలా అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో రజినీకాంత్ అతిథి పాత్రలో కనిపించగా.. మోహన్ బాబు మాత్రం డ్యూయల్ రోల్‌లో మెప్పించారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఓ సన్నివేశంలో బ్రహ్మానందం తాను ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని తన తండ్రి దగ్గరకు వచ్చే సీన్ బాగా పండింది. అయితే ఆ సీన్‌లో బ్రహ్మానందం భార్యగా నటించిన నటి మరేవరో కాదు. జబర్దస్త్ లేడీ కమెడియన్ సత్య శ్రీ తల్లి. ఈమె పెద్దరాయుడు సినిమాతో పాటు ఇష్క్, ఆర్య 2 సినిమాల్లోనూ నటించింది. ఇక కూతురు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆమె సినిమాలు మానేసింది. ఈ విషయాన్నీ ఓ ఇంటర్వ్యూలో సత్య శ్రీ తెలిపింది. ఇక సత్య శ్రీ విషయానికి వస్తే.. జబర్దస్త్ షో ద్వారా మంచి ఫేమ్ తెచ్చుకుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
(video link credits to sathya sri instagram id)