- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనం ఎన్నో సార్లు ప్లాన్ వేశాం.. కానీ ఇప్పటికీ ఆ పని చేయలేకపోయాం.. రష్మికకు మెసేజ్ చేసిన టాలీవుడ్ యాక్టర్
దిశ,వెబ్ డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు జోరు తగ్గిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఈమె కెరీర్ అంతా కూడా పుష్ప ది రూల్ మీద ఆధారపడి ఉంటుంది. బాలీవుడ్‌లో సినిమాలు చేసినప్పటికీ ఒక్కటి కూడా హిట్ కాలేదు. ఇక రణ్‌బీర్ కపూర్ యానిమల్ సినిమాతో బాలీవుడ్‌లో ఆమె భవితవ్యం ఏంటో చెబుతుంది. చివరగా ఆమెకు ఉండే ఒకే ఒక ఆప్షన్ పుష్ప పార్ట్ 2. శ్రీవల్లిగా నార్త్ ప్రేక్షకులను మెప్పిస్తే.. ఇంకొన్ని బాలీవుడ్ ప్రాజెక్టులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. టాలీవుడ్‌లో రష్మికకు ఇది వరకు లా ఆఫర్లు రావడం లేదు. స్టార్ హీరోల లిస్ట్ నుంచి రష్మికను తీసేసినట్టుగా అనిపిస్తోంది. ఇప్పుడంతా శ్రీలీల ట్రెండ్ నడుస్తోంది. ఇదిలా ఉండగా..
తాజాగా రష్మిక నెట్టింట్లో ఓ పోస్ట్ వేసింది. ట్రావెలింగ్‌ను బాగా మిస్ అవుతున్నాను.. సమయం దొరికినప్పుడు ఏదొక ప్రదేశానికి వెళ్లండని సలహా ఇస్తోంది. మీ ఇంటికో, ఫ్రెండ్స్ ఇంటికో, డ్రీమ్ డెస్టినేషన్‌కో, నచ్చిన ప్రదేశానికో వెళ్లండి.. ట్రావెలింగ్ అనేది మనమేంటో మనల్ని మనకే పరిచయం చేస్తుందంటూ రష్మిక పోస్ట్ లో రాసుకొచ్చింది. అయితే ,ఆ పోస్ట్ మీద కళ్యాణీ ప్రియదర్శన్ వేసిన కౌంటర్ వైరల్ అవుతుంది. మనం ఎన్నో సార్లు కలిసి ట్రిప్ వేయాలని ప్లాన్ వేశాం.. నాకు తెలిసి మనం 4732 సార్లు ప్లాన్ వేసి ఉంటాం.. కానీ ఒక్కసారి కూడా ఎక్కడికి వెళ్లలేదంటూ రష్మిక పరువు తీసేసింది.దీనిపై నేషనల్ క్రష్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.