ఆ రూమర్స్ వల్లే మేము విడిపోవాల్సి వచ్చింది.. విడాకులపై నాగచైతన్య కామెంట్స్

by Hamsa |   ( Updated:2023-05-06 06:59:58.0  )
ఆ రూమర్స్ వల్లే మేము విడిపోవాల్సి వచ్చింది.. విడాకులపై నాగచైతన్య కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత, నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి వాళ్లు విడాకులు తీసుకోవడానికి గల కారణాలను ఇద్దరూ మీడియా ముఖంగా చర్చించలేదు. అయితే తొలిసారిగా నాగచైతన్య సమంతతో విడాకులపై స్పందించారు.

తాజాగా, కస్టడీ సినిమాతో రాబోతున్న చై ప్రమోషన్స్‌లో భాగంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘‘మేం విడిపోయి రెండేళ్లు అవుతుంది. చట్టపరంగా మాకు విడాకులు వచ్చి ఏడాది అవుతుంది. ఇద్దరం విడిపోయినా ఆమెతో కలిసి ఉన్న రోజులను చాలా గౌరవిస్తాను. నిజానికి సమంత మంచి అమ్మాయి. అన్ని ఆనందాలకు ఆమె అర్హురాలు. సోషల్‌ మీడియాలో వచ్చిన రూమర్స్‌ వల్లే మా మధ్య గొడవలు మొదలయ్యాయి. అవి పెద్దవై చివరికి విడిపోవాల్సి వచ్చింది. మొదట్లో నేను కూడా రూమర్స్‌ గురించి అంతగా పట్టించుకోలేదు. కానీ, ఆ తర్వాత పరిస్థితులు మారాయి. మేం విడిపోయినా ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవం ఉంది. కానీ మీడియా, వెబ్‌సైట్స్‌.. మాకు ఒకరిపై ఒకరికి గౌరవం లేనట్లు చిత్రీకరించడం నా మనసుకు బాధకలిగించింది. నా గతంలో ఏమాత్రం సంబంధం లేని మూడో వ్యక్తిని ఇందులోకి లాగి వాళ్లను అగౌరవ పరిచినట్లు వార్తలు రాశారు. అది చాలా చెత్త విషయం. జీవితంలో ప్రతీది ఒక గుణపాఠం లాంటిదే. ప్రతి దశలో ఏదో ఒకటి నేర్చుకుంటాం. ఏం జరిగినా అంతా నా మంచికే అనుకుంటాను. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Read more:

విడాకులపై నాగచైతన్య కామెంట్స్.. సమంత రియాక్షన్ !

సాయిపల్లవి రిజెక్ట్ చేసిన ‘ఆ సీన్‌’లో నిహారిక.. ‘పుష్ప 2’ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్

Advertisement

Next Story