మమతా బెనర్జీపై పరువునష్టం దావా.. ఎవరూ ఆపలేరంటున్న డైరెక్టర్ వివేక్

by Prasanna |   ( Updated:2023-05-15 12:28:09.0  )
మమతా బెనర్జీపై పరువునష్టం దావా.. ఎవరూ ఆపలేరంటున్న డైరెక్టర్ వివేక్
X

దిశ, సినిమా : బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై పరువు నష్టం కేసు దాఖలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వివేక్ అగ్నిహోత్రి తెలిపాడు. తాజాగా ఆమె మాట్లాడిన వీడియోను నెట్టింట షేర్ చేసిన వివేక్.. ‘నేను ఊహించినట్లే దీదీ నా గురించి మాట్లాడుతున్నారు. అవును, ఖిలాఫత్ ప్రేరేపించిన డైరెక్ట్ యాక్షన్ డే మారణహోమం నుంచి బయటపడిన వారిని ఇంటర్వ్యూ చేయడానికి నేను బెంగాల్ వచ్చాను. అయినా #TheKashmirFiles మారణహోమం, తీవ్రవాదం గురించి మీరెందుకు భయపడుతున్నారు? ఏ ప్రాతిపదికన కశ్మీరీల పరువు తీయాలనుకుంటున్నారు. ఇంత దురుద్దేశం, రాజకీయ కక్షతో ఎందుకు నిందలు మోపుతున్నారు? నేను మీపై పరువు నష్టం కేసు ఎందుకు దాఖలు చేయకూడదు? నా చిత్రం పేరు బెంగాల్ ఫైల్స్ కాదు #TheDelhiFiles. నన్ను ఎవరూ ఆపలేరు’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చాడు.

Also Read..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ ట్రైలర్ రిలీజ్..

Advertisement

Next Story