ఆ హీరోకు చిత్తశుద్ధి లేదు : స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

by Hamsa |   ( Updated:2023-05-19 11:58:51.0  )
ఆ హీరోకు చిత్తశుద్ధి లేదు : స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా : బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.. స్టార్ హీరో అమీర్ ఖాన్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో 'లాల్ సింగ్ చడ్డా'పై తన అభిప్రాయాన్ని వెల్లడించిన వివేక్ హీరోపై తనదైన శైలిలో విమర్శలు చేశాడు. 'అమీర్ సినిమాపై బహిష్కరణ ప్రభావం ఉందనుకోట్లేదు. హీరోకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే అలా జరిగింది. ఆయన అర్థం చేసుకుంటారని ఇలా మాట్లాడుతున్నా. తనకు చాలా మంది అభిమానులున్నారని చెప్పుకుంటారు కదా. మరి వాళ్లంతా సినిమా ఎందుకు చూడలేదు.

అంటే అతనికి ఫ్యాన్స్ లేరని తేలిపోయినట్లేగా. మీడియా సమావేశాల్లో అమీర్ చెప్పేదంతా బోగస్, మోసం. సెపరేట్ ఫ్యాన్ బేస్ లేనప్పుడు రూ.150 నుంచి 200 కోట్లు ఖర్చు ఎందుకు చేయిస్తున్నారు' అంటూ కాంట్రవర్సీగా మాట్లాడారు. అయితే 'దంగల్' సినిమాను బాయ్‌‌కాట్ చేయాలనడం దారుణమన్న వివేక్.. అందులో కనిపించిన అమీర్‌ నిజాయితీ 'లాల్ సింగ్ చడ్డా'లో ఎక్కడా తారసపడలేదన్నాడు.

Advertisement

Next Story