- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అనుష్కాతో సెల్ఫీ దిగాలని చూసిన ఫ్యాన్.. సీరియస్ అయిన విరాట్.. (వీడియో)

దిశ, వెబ్‌డెస్క్: సెలబ్రిటీలు బయట కనిపిస్తే అభిమానులు సెల్ఫీల కోసం ఎగపడతారు. వాళ్ల ప్రియమైన సెలబ్రిటీలతో ఫొటోలు దిగే క్రమంలో ఒక్కోసారి వాళ్లను ఇబ్బందులకు గురిచేస్తారు. అలాంటి సమయాల్లో సెలబ్రిటీలు వాళ్ల సహనం కోల్పోయి సీరియస్ అవుతుంటారు. తాజాగా ఇదే సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. క్రికెటర్ వికాట్ కోహ్లి ఓ అభిమానిపై సీరియస్ అవ్వడం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ కలిసి బెంగళూరులోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌కు వెళ్లారు. వాళ్లు అక్కడికి వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు వాళ్లతో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. కనీసం అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ వాళ్ల కారు దగ్గరకు వెళ్లేందుకు కూడా గ్యాప్ ఇవ్వకుండా ఫొటోలు కోసం ముందుకు వచ్చారు. ఈ క్రమంలొనే అనుష్క శర్మ కారు డోర్ తీస్తుండగా ఓ అభిమాని డోర్ దగ్గరకు వచ్చేసరికి విరాట్ అతడిని కోప్పాడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Read: స్టార్ డైరెక్టర్ కాళ్లు మొక్కిన ఐశ్వర్య రాయ్.. తన అదృష్టమేనంటూ