- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎప్పటికి అతడే నా ఫేవరెట్ క్రికెటర్.. Mrunal Thakur ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: స్వచ్ఛమైన లవ్ స్టోరీ బ్యాక్ గ్రౌండ్‌తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీతారామం సినిమా భారీ హిట్ అందుకుంది. ఇందులో హీరోయిన్‌గా నటించిన మృణాల్ ఠాకూర్.. టాలీవుడ్‌లో తొలి చిత్రంతోనే అభిమానుల మనస్సులు కొల్లగొట్టింది. ఇక ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ నటనకు కుర్రకారు ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉండే మృణాల్.. హాట్ హాట్ ఫొటోలతో ఫ్యాన్స్‌తో ఎప్పుడు టచ్‌లో ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో #Askmrunal పేరుతో చిట్ చాట్ నిర్వహించింది మృణాల్. ఇందులో భాగంగా ఓ నెటిజన్ మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు అని ఓ నెటిజన్ అడిగాడు. దీంతో ఎప్పటికీ విరాట్ కోహ్లీనే తన ఫేవరెట్ క్రికెటర్ అని ఠక్కున సమాధానం చెప్పేసింది ఈ సీతారామం బ్యూటీ.
ఇక హనురాఘవ పూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ''సీతారామం''. ఆగస్ట్ 5న విడుదల అయిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్‌ల వర్షం కురిపిస్తోంది.
- Tags
- Mrunal Thakur