ఆ నీచమైన కామెంట్స్ చూస్తే కన్నీళ్లు ఆగలేదు.. ప్రతి పార్ట్‌ను ఎగతాళి చేశారు

by Prasanna |   ( Updated:2023-09-15 15:49:49.0  )
ఆ నీచమైన కామెంట్స్ చూస్తే కన్నీళ్లు ఆగలేదు.. ప్రతి పార్ట్‌ను ఎగతాళి చేశారు
X

దిశ, సినిమా: సీనియర్ నటి విద్యా బాలన్ తనపై వచ్చిన బాడీ షేమింగ్ కామెంట్స్ చూసి ఓసారి కన్నీళ్లు పెట్టుకున్నట్లు చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కెరీర్ అనుభవాలు పంచుకున్న ఆమె.. ‘నా శరీరాకృతి కారణంగా చాలా ట్రోలింగ్ ఎదుర్కొన్నా. నా బాడీ షేప్‌పై దారుణంగా కామెంట్స్ చేస్తూ ఎగతాళి చేశారు. అయితే కాలక్రమేణా వాటి నుంచి నన్ను రక్షించుకోవడం నేర్చుకున్నా. ముఖ్యంగా సోషల్ మీడియాలో కామెంట్స్ చదవడం మానేశా. పోస్టింగ్ చేయడం ఆపేశా. చాలా అరుదుగా సోషల్ మీడియా యూజ్ చేస్తున్నా’ అని తెలిపింది. అలాగే భవిష్యత్తులో ఎదురయ్యే మంచి, చెడులను తెలుసుకునేందుకు జ్యోతిష్కుల వద్దకు అసలు వెళ్లనని.. ఎందుకంటే వాళ్లే కష్టాలొస్తాయని చెప్పి, మళ్లీ వారే దాని నుంచి విముక్తి కల్పిస్తామనే భ్రమలో పడేస్తారని వెల్లడించింది. ‘అసౌకర్యంగా అనిపించే వ్యక్తులను కలవకుండా ఉండటమే బెస్ట్. ఎవరితోనైనా ఇంటరాక్షన్‌లో కంఫర్ట్‌గా లేననిపిస్తే వెంటనే ఆ వ్యక్తితో డిస్టెన్స్ మెయింటెన్ చేస్తా’ అని తెలిపింది.

ఇవి కూడా చదవండి : ఈ అందం ఎవరి సొంతం కాదంటున్న Sonal Chauhan.. అసలే వదిలిపెట్టమంటున్న కుర్రాళ్లు

Advertisement

Next Story