అనారోగ్యంతో బాధపడుతున్న శృతిహాసన్.. వైరల్ వీడియో

by Prasanna |   ( Updated:2023-10-18 09:21:03.0  )
అనారోగ్యంతో బాధపడుతున్న శృతిహాసన్.. వైరల్ వీడియో
X

దిశ, సినిమా : ఎప్పటికప్పుడూ తన టాలెంట్‌తో తనని తాను నిరూపించుకుంటుంది స్టార్ హీరోయిన్ శృతిహాసన్. ప్రజంట్ కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తు బిజీగా ఉంది. అయితే గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో శ్రుతిహాసన్ ఏదో అనౌన్స్‌ చేయాలని తెగ ఆరాట పడుతోంది. ఈ నెల 26న ఓ శుభవార్త చెబుతానని అందరినీ ఊరిస్తోంది. కానీ తాజాగా శ్రుతి తన ఆనందానికి బ్రేక్ పడ్డట్టు తెలిపింది. ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో చిన్న వీడియోను షేర్ చేసింది. ‘గత నాలుగు రోజులుగా ఫ్లూతో బాధపడుతున్నా. జ్వరంతో పాటు డెంగ్యూ లక్షణాలు కూడా కనపడుతున్నాయి. దేవుడా ప్లీజ్ అలా మాత్రం చేయకు. 26వ తేదీ వరకు అలాంటివేమీ నాకు ఇవ్వొద్దు’ అని వేడుకుంటుంది శ్రుతి హాసన్. మరి ఇంతకు ఆ గుడ్ న్యూస్ ఏమిటనేది తెలియాలంటే 26 వరకు వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed