వెంకటేష్, రానాల 'రానా నాయుడు' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

by Hamsa |
వెంకటేష్, రానాల రానా నాయుడు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోలు వెంకటేష్, రానా కలిసి నటించిన తాజా వెబ్ సిరీస్ 'రానా నాయుడు'. ఈ వెబ్ సీరీస్ తెలుగు, తమిళంతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో అంచానాలను భారీగా పెంచేశాయి. ఈ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు రానా డబుల్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ట్విట్టర్ వేదికగా 'రానా నాయుడు' వెబ్ సిరీస్ ట్రైలర్'ను విడుదల చేసి స్ట్రీమింగ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశాడు. ఈ సిరీస్ మార్చ్ 10న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్టు తెలిపాడు. తండ్రీకొడుకుల క‌థ‌తో యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సిరీస్ తెర‌కెక్కింది. ఇందులో బాలీవుడ్‌ సెల‌బ్రిటీల‌కు వ‌చ్చే స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించే వ్యక్తిగా రానా క‌నిపించ‌గా అత‌డి తండ్రి నాగ‌గా వెంక‌టేష్ డిఫ‌రెంట్ క్యారెక్టర్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.

Advertisement

Next Story

Most Viewed