‘అరి’ ట్రైలర్‌పై వెంకయ్య నాయుడు ఆసక్తికర ట్వీట్..

by Hamsa |   ( Updated:2023-03-30 10:25:58.0  )
‘అరి’ ట్రైలర్‌పై వెంకయ్య నాయుడు ఆసక్తికర ట్వీట్..
X

దిశ, వెబ్ డెస్క్: డైరెక్టర్ జయశంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అరి’. ఇందులో అనసూయ, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, శుభలేక సుధాకర్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాను శేషు మారంరెడ్డి నిర్మించారు. అయితే ఈ మూవీ ట్రైలర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా, అరి సినిమా చిత్రబృందం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కలిసి అరి ట్రైలర్‌ను చూపించారు. ట్రైలర్‌ను చూసిన వెంకయ్య నాయుడు ట్విట్టర్ ద్వారా అరి సినిమాపై ప్రశంసలు కురిపించారు. ‘‘అరి సినిమా ప్రచార చిత్రాన్ని వీక్షించడం ఆనందదాయకం. ఆరు రకాల అంత శత్రువులను ప్రతి మనిషి జయించాలన్న సందేశంతో చక్కని కథ, కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు శ్రీ జయశంకర్, నిర్మాత శ్రీ అభిషేక్ అగర్వాల్ సహా చిత్ర బృందాన్ని అభినందిస్తూ, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ రాసుకొచ్చారు.

Advertisement

Next Story