మెగా ఫ్యామిలీలోని ఆడవాళ్ల గురించి సీక్రెట్ బయటపెట్టిన వరుణ్ తేజ్.. ఆ రోజు ఆడవాళ్లంతా అలా చేస్తారంటూ!

by Anjali |   ( Updated:2024-02-25 17:23:37.0  )
మెగా ఫ్యామిలీలోని ఆడవాళ్ల గురించి సీక్రెట్ బయటపెట్టిన వరుణ్ తేజ్.. ఆ రోజు ఆడవాళ్లంతా అలా చేస్తారంటూ!
X

దిశ, సినిమా: మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మెగా ఫ్యామిలీకి గొప్ప పేరు ఉంది. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. వీరి కుమారులు కొన్నేళ్లుగా సినిమాల్లో నటిస్తూ.. వీరి అద్భుతమైన నటనతో కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నారు. మగవారే కాకుండా ఈ ఫ్యామిలీ నుంచి నాగబాబు డాటర్ నిహారిక నిర్మాత అండ్ హీరోయిన్ గా రాణిస్తుంది.

మెగాస్టార్ కుమార్తె సుష్మిత ప్రొడ్యూసర్‌గా చేస్తుంది. ఇదంతా పక్కన పెడితే.. అయితే ఈ ఫ్యామిలీ గురించి తాజాగా నెట్టింట ఓ వార్త హాట్ టాపిక్‌గా మారింది. అయితే మెగా ఫ్యామిలీలో సంక్రాంతి ఫెస్టివల్ రోజు ఆడవాళ్లు ఏ పని చేయరట. ఖాళీగానే కూర్చుంటారట. ఆ రోజు మొత్తం మగవాళ్లే అన్ని పనులు చేస్తారట.

ఈ విషయాన్ని స్వయంగా వరుణ్ తేజ్ తన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెప్పుకొచ్చాడు. అలాగే సంక్రాతికి ఫ్యామిలీ అంతా కలిసి క్రికెట్ ఆడుతారట. ఇక ఏ ఫెస్టివల్ అయినా అల్లు ఫ్యామిలీ అండ్ మెగా ఫ్యామిలీ ఒక దగ్గరే ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.

Read More..

ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ‘పుష్ప 2’లో అల్లు అయాన్!

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed