రొమాన్స్, లిప్‌లాక్ సీన్లు ఇంట్లో వాళ్లతో కలిసి చూసినప్పుడు వాళ్లు ఏం అనుకున్నారంటే: Vaishnavi Chaithanya

by sudharani |   ( Updated:2023-07-17 09:19:31.0  )
రొమాన్స్, లిప్‌లాక్ సీన్లు ఇంట్లో వాళ్లతో కలిసి చూసినప్పుడు వాళ్లు ఏం అనుకున్నారంటే: Vaishnavi Chaithanya
X

దిశ, వెబ్‌డెస్క్: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘బేబీ’. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈనెల-14 న రిలీజై సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది. విడుదలైన మూడు రోజుల్లోనే భారీ కలెక్షన్లు రాబట్టంతో.. ప్రస్తుతం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తుంది ‘బేబీ’ టీం. దీంతో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా గురించి ముచ్చటిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాలో రొమాన్స్, కిస్ సీన్ గురించి ఓపెన్ అయింది వైష్ణవి.

ఆమె మాట్లాడుతూ.. ‘‘సినిమాల్లో రొమాన్స్, లిప్‌లాక్ సీన్లలో నటించడం చాలా కష్టం. కానీ నా అదృష్టం ఏంటంటే.. ఆ సీన్ చేసే రోజు సెట్‌లో ఎక్కువ మంది లేకుండా జాగ్రత్తపడ్డారు మేకర్స్. నన్ను చాలా కంఫర్ట్‌గా చూసుకున్నారు. సినిమా కోసం ఎన్నో సీన్లు చేస్తాం. అందులో ఇది ఒకటి అనుకో.. మనం జస్ట్ నటిస్తున్నామ్ అంతే అంటూ అశ్విన్ కూడా నాలో ధైరాన్ని నింపాడు. నేను కూడా జస్ట్ సీన్ అనుకునే చేశా. ఇంట్లో వాళ్లతో కలిసి సినిమా చూసినప్పుడు వాళ్లు కూడా దీన్ని సన్నివేశంలో బాగంగానే ఆలోచించారు’’ అంటూ చెప్పుకొచ్చింది యంగ్ బ్యూటీ వైష్ణవి.

ఇవి కూడా చదవండి:

‘బేబీ’ హీరోయిన్ Vaishnavi Chaithanya ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా!

ఆ హోటల్‌లోనే పరిణీతి-రాఘవ్‌ల రిసెప్షన్.. ఎన్ని రకాల వంటకాలో తెలుసా?

Advertisement

Next Story