వివేకా హత్య కేసులో వరుసగా సాక్షుల మరణం.. అప్రూవర్ దస్తగిరి కీలక నిర్ణయం

by Shiva |
వివేకా హత్య కేసులో వరుసగా సాక్షుల మరణం.. అప్రూవర్ దస్తగిరి కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వారు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొన్న కసనూరుకు చెందిన శ్రీనివాసుల రెడ్డి (Srinivasula Reddy) ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదేవిధంగా ప్రత్యక్ష సాక్షిగా ఉన్న దేవిరెడ్డి అనుచరుడు కల్లూరు గంగాధర్‌ రెడ్డి (Gangadhar Reddy) తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో 2022లో మృతి చెందారు. వివేకా‌కు వైద్య పరీక్షలు చేయించిన జగన్‌ మామ ఈసీ గంగిరెడ్డి (Gangi Reddy) 2022లో చనిపోయారు. అదేవిధంగా హత్య జరిగిన రోజు రాత్రి వివేకా తలకు బ్యాండేజీ వేసిన డాక్టర్‌ వైఎస్‌ అభిషేక్‌ రెడ్డి (YS Abhishek Reddy) ఇటీవలే తీవ్ర అనారోగ్యంతో మరణించారు. మరో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్‌మన్‌ రంగయ్య (Rangaiah) ఈ నెల 6న అనారోగ్యంతో కడప రిమ్స్‌ (Kadapa RIMS)లో కన్నుమూశాడు.

ఈ క్రమంలోనే కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షులు వరుసగా చనిపోతున్న వేళ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి (Dastagiri) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేసులో తాను అప్రూవర్‌గా మారినందున భద్రత కల్పించలని కడప ఎస్పీ (SP) కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. మందు జాగ్రత్త కోసమే తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని దస్తగిరి తెలిపారు. ఈ పరిణామంతో వివేకా హత్య కేసులో సాక్షుల మరణాలు హత్యలా.. సాధారణ మరణాలా తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.



Next Story

Most Viewed