కాంతారా 2లో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ?

by samatah |   ( Updated:2023-02-12 04:39:09.0  )
కాంతారా 2లో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ?
X

దిశ, వెబ్‌డెస్క్ : రిషబ్ షెట్టి దర్శకత్వంలో, ఆయనే హీరోగా నటించి మెప్పించిన సినిమా కాంతారా. ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమా ప్రీ సీక్వెల్ వస్తున్నట్లు తెలిసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం కాంతారా 2కి సంబంధించిన ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. కాగా, ఈ క్రమంలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌంతేలా పోస్ట్ చేసిన ఓ ఫొటో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే, కన్నడ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టితో దిగిన ఫొటోను బ్యూటీ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.అంతే కాకుండా కాంతార 2' లోడింగ్ అనే మెసేజ్ కూడా పోస్ట్ చేయడంతో, కాంతారా 2లో హీరోయిన్‌గా ఊర్వశీ నటిస్తుందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story