అయ్యో పాపం.. ఉయ్యాలపైనుంచి జారిపడిన Urfi Javed

by srinivas |   ( Updated:2023-05-26 03:28:53.0  )
అయ్యో పాపం.. ఉయ్యాలపైనుంచి జారిపడిన Urfi Javed
X

దిశ, సినిమా: సరికొత్త డ్రెస్సింగ్ స్టైల్‌తో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన మోడల్, ఆర్టిస్ట్ ఉర్ఫీ జావేద్ మరోసారి వార్తల్లో నిలిచింది. హిందీ 'బిగ్‌బాస్‌'లో కంటెస్టెంట్‌గా ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకున్న ఈ అమ్మడు.. సోష‌ల్ మీడియాలో నిరంతరం హల్‌చల్ చేస్తోంది. బోల్డ్ లుక్స్‌తో కుర్రకారును కవ్విస్తోంది. తనపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా అసలు లెక్క చేయదు. రోజుకో కొత్త వేషధారణలో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా తను నటించిన మ్యూజిక్ వీడియోను నెట్టింట పోస్ట్ చేసింది. అయితే షూట్ చేస్తున్న క్రమంలో ఉయ్యాల మీద నుంచి జారి నేలపై పడిపోతుంటే పక్కనే ఉన్న డ్యాన్సర్లు జాగ్రత్తగా పట్టుకున్నారు. దీంతో ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story