- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Upasana Konidela: మెగాస్టార్ భార్య సురేఖపై సంచలన కామెంట్స్ చేసిన కోడలు ఉపాసన!
దిశ, సినిమా: టాలీవుడ్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అపోలో ఆసుపత్రి చైర్మన్ మనవరాలైన ఉపాసన.. చరణను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2012 లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న వీరు 11 ఏళ్ల తర్వాత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. మెగా ఫ్యామిలీలోకి ఈ బుజ్జాయి అడుగు పెట్టడంతో మెగా కుటుంబం మొత్తం సంతోషంలో నిండిపోయింది.
రీసెంట్ గా ఉపాసన-చరణ్ ఉమెన్స్ డే సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరై.. ఒకరిపై ఒకరు పొగడ్తల వర్షం కురిపించుకున్నారు. ‘‘ఉపాసన నా రాక్ స్టార్. తను ఫ్యామిలీకి చాలా వాల్యూ ఇస్తుంది. వారసత్వాన్ని ముందుకు నడిపిస్తుంది. తన ఎప్పుడు సొంత మార్గాన్ని ఎంచుకుంటుంది. తనలాగా నేను ఎప్పుడు చేయలేనని చరణ్ ఉపాసన గురించి చెప్పుకొచ్చాడు. ఉపాసన కూడా చరణ్ ఫ్యామిలీ నా ఫ్యామిలీ టోటల్లీ భిన్నంగా ఉంటుంది.
కానీ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం అని ఉపాసన వెల్లడించింది. తాజాగా ఉపాసన నాలెడ్జి సిటీలోని టి-హబ్ లో ట్రంఫ్ ఆఫ్ టాలెంట్ హౌజ్ ఆఫ్ మేకప్ ఆధ్వర్యంలో పలు రంగాల్లో రాణించిన మహిళలకు విమెన్ ఆఫ్ ఇంఫాక్ట్ అవార్డుల పంపిణీ క్యార్యక్రమానికి హాజరైంది. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ..
‘మా అత్తయ్య చాలా గొప్ప పర్సన్. అందరిపై ప్రేమ చూపిస్తుంది. ఎవ్వరిని నొప్పించేలా మాట్లాడదు. తనే నా స్ఫూర్తి. ముఖ్యంగా నేడు ధైర్యంగా, స్ట్రాంగ్ గా ఉండే మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపేందుకే ఈ అవార్డుల ప్రోగ్రామ్ కి హాజరయ్యాను. ఎలికో లిమిటెడ్ వైస్ చైర్ పర్సన్ నవితా పట్ల మహిళలు అన్ని రంగాల్లో రాణించడం ఎంతో అవసరమని’ ఉపాసన తెలిపారు.