మూడు ముళ్ల బంధంలోకి టాలీవుడ్ యంగ్ హీరో.. తన తొలి హీరోయిన్‌తోనే పెళ్లి

by srinivas |   ( Updated:2024-03-11 10:37:58.0  )
మూడు ముళ్ల బంధంలోకి టాలీవుడ్ యంగ్ హీరో.. తన తొలి హీరోయిన్‌తోనే పెళ్లి
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. 2019లో విడుదలైన రాజావారు.. రాణిగారు మూవీలో నటించారు. ఈ మూవీలో హీరోయిన్‌గా నటించిన రహస్య గోరఖ్‌నే ఆయన వివాహం చేసుకోబోతున్నారు. వీరిద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తాజాగా ఈ ప్రేమ పరిణయంగా మారుబోతోంది. ఈ నెల 13న కిరణ్ అబ్బవరం- రహస్య ఎంగేజ్ మెంట్ జరగబోతోంది. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోన్నారు. తన తొలి హీరోయినే కిరణ్ అబ్బవరం భాగస్వామిగా చేసుకుంటున్నారు.


కాగా 2019లో సినీ రంగ ప్రవేశ చేసిన ఆయన పలు సినిమాల్లో హీరోగా నటించారు. తొలుత ఆయన ఫార్ట్స్ ఫిలిమ్స్‌లో నటించిన ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత ఎవరి సపోర్ట్ లేకుండానే కిరణ్ అబ్బవరం టాలీవుడ్‌లోకి ఎంటర్ అయ్యారు. తొలి సినిమా రాజావారు.. రాణిగారు సినిమాతోనే మంచి గుర్తింపు పొందారు. హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. తన తొలి హీరోయిన్ రహస్యనే కిరణ్ అబ్బవరం పెళ్లి చేసుకుంటుండటంతో సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed