Salaar Movie: సలార్ మూవీ బ్లాక్ బస్టర్ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేసిన టాలీవుడ్ హీరో

by Prasanna |   ( Updated:2023-12-23 06:20:43.0  )
Salaar Movie: సలార్ మూవీ బ్లాక్ బస్టర్ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేసిన టాలీవుడ్ హీరో
X

దిశ,వెబ్ డెస్క్: భారీ అంచనాల మధ్య ఈరోజు సలార్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా రిలీజ్ అయింది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు ప్రదర్శితమయ్యాయి. అలానే తెలంగాణలో కూడా రాత్రి నుంచి షోలు పడుతున్నాయి. డార్లింగ్ అభిమానులతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఎక్స్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

హీరో నిఖిల్ " ఇప్పుడే సినిమా చూసా.. ఈ మూవీ బ్లాక్ బస్టర్.. ప్రభాస్ ను స్క్రీన్ మీద చూస్తున్నంత సేపు గూస్ బంప్స్ వచ్చాయి. యంగ్ రెబల్ స్టార్ అద్భుతం. విజువల్స్ బావున్నాయి. చిత్ర యూనిట్ కి అభినందనలు. తప్పక చూడాల్సిన సినిమా ఇది" అంటూ ఎక్స్ లో పోస్ట్ చేసారు.

Advertisement

Next Story

Most Viewed