- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజమౌళికి తృటిలో తప్పిన ప్రమాదం.. మహేష్ సినిమా ఏకంగా జక్కన్న ప్రాణాల మీదకే తెచ్చిపెట్టిందిగా?
దిశ, సినిమా: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి గురించి సుపరిచిమే. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెబుతూ.. ఒక్కో సినిమాతో తన ఇమేజ్ ను మరింత పెంచుకుంటూ పోతున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కిన ‘బాహుబలి’ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ దర్శకుడికి టాలీవుడ్ లో తిరుగులేకుండా పోయింది. తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాతో జక్కన్న క్రేజ్ పాన్ వరల్డ్ రేంజ్ కు ఎదిగింది. ఈ మూవీస్ భారీ వసూళ్లను కొల్లగొడుతూ.. బాక్సాఫీసును షేక్ చేశాయి.
ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ కు ఏకంగా ఆస్కార్ అవార్డు రావడంలో రాజమౌళి ఎవరనే చర్చ హాలీవుడ్ తో పాటు ప్రపంచ సినిమా మొత్తం చర్చించుకుంది. అలాంటి స్టార్ డైరెక్టర్ ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో మరో ప్రాజెక్ట్ రూపొందించడానికి సిద్ధమయ్యాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమా పనుల కోసం జపాన్ వెళ్లిన జక్కన్నకు పెను ప్రమాదం తప్పింది. అక్కడ భూకంపం భారీ నుంచి తృటిలో తప్పించుకున్నట్లు ఎస్ ఎస్ కార్తికేయ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
‘‘ఓ బిల్డింగ్ లో 28 వ ఫ్లోర్ లో ఉన్నాం. అప్పుడే మెల్లగా భూమి కంపించడం స్టార్ట్ అయింది. జపాన్ లో భూకంపం ఎలా ఉంటుందో చూశా. మేం చాలా ఆందోళన చెందాం. కానీ మా చుట్టూ ఉన్న జపనీయులు మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా ఉన్నారు. ఏదో వర్షం పడుతున్నంత ఈజీగా వాళ్లు లైట్ తీసుకున్నారు. మొత్తానికి భూకంపాన్ని ఎక్స్‌పీరియెన్స్ చేశాం’’. అంటూ కార్తికేయ చెప్పుకొచ్చాడు. దీంతో పలువురు జనాలు మహేష్ బాబు సినిమా ఏకంగా రాజమౌళి ప్రాణాల మీదకే తెచ్చిపెట్టిందిగా అంటూ కామెంట్లు పెడుతున్నారు.