- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినిమాలో హీరోయిన్‌లాంటి మెడ కోసం ఆస్పత్రుల్లో అమ్మాయిల క్యూ
దిశ, ఫీచర్స్: ‘బార్బీ’ సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సృష్టించింది. కానీ వసూళ్లను పక్కనపెడితే ఈ చిత్రం తర్వాత కొత్త రకమైన బొటాక్స్ చికిత్సను ఆశ్రయిస్తున్న యువతుల సంఖ్య పెరిగింది. ఈ మూవీ హీరోయిన్ మార్గోట్ రాబీ మాదిరిగా హంసలాంటి మెడ పొందాలనుకునే వారు ‘బార్బీ బొటాక్స్’ను ప్రిఫర్ చేస్తున్నారు. అయితే ఇలా మెడ దగ్గర ఉన్న కండరాలను స్తంభింపచేసి ‘స్వాన్ నెక్’ పొందేందుకు టాక్సిన్స్ ఉపయోగిస్తున్నారని ఆందోళన చెందుతున్న కాస్మోటాలజిస్టులు.. దీనివల్ల ఫ్యూచర్‌లో దుష్ప్రభావాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
‘ట్రాప్ టాక్స్’ అని పిలవబడే ప్రాసెస్... నెక్‌ను స్లిమ్ చేసి, షేప్‌ను మారుస్తుంది. అయితే US FDA ఆమోదించిన ఇంజెక్షన్లను కేవలం ఫేస్ బొటాక్స్‌లో మాత్రమే యూజ్ చేయడానికి పరిమితం చేయబడింది. కానీ ఇప్పుడు మెడకు కూడా వినియోగిస్తున్నారు. పైగా మెడిస్పాస్, బ్యూటీ క్లినిక్‌లలో శిక్షణ లేని వ్యక్తులు.. మెడ వంటి సున్నితమైన ప్రదేశంపై ప్రయోగాలు చేయడం ఆందోళన కలిగించే విషయం. ఇంతకీ ‘బార్బీ బొటాక్స్ లేదా ట్రాప్ టాక్స్’ అంటే ఏమిటీ? దీనివల్ల కలిగే లాభాలు, నష్టాల మాటేంటి? నిపుణులు ఎందుకు వర్రీ అవుతున్నారు? అనే విషయాల గురించి తెలుసుకుందాం.
ట్రాప్ టాక్స్ అంటే ఏమిటి?
‘ట్రాప్ టాక్స్’ అనేది అప్పర్ బ్యాక్‌లోని ట్రాపెజియస్ కండరాలలో బోటులినమ్ టాక్సిన్‌ను ఉపయోగించడంతో కూడిన ప్రొసీజర్. హైపర్-కాంట్రాక్ట్డ్ ట్రాపెజియస్ కండరంతో సంబంధం ఉన్న నెక్ టెన్షన్, షోల్డర్ పెయిన్‌ను తగ్గించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే దీనివల్ల ప్రామిజింగ్ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ.. పొటెన్షియల్ డ్రాబ్యాక్స్ కారణంగా ఈ ప్రయోజనాలను అందిస్తుందా లేదా అనేది అంచనావేయడం కష్టం.
బెనిఫిట్స్-సైడ్ ఎఫెక్ట్స్
అతి చురుకైన ట్రాపెజియస్ కండరం నుంచి ఉత్పన్నమయ్యే నెక్ టెన్షన్, షోల్డర్ పెయిన్‌తో బాధపడేవారికి ‘ట్రాప్ టాక్స్’ బెనిఫిట్స్‌ను అందిస్తుంది. ఈ ప్రక్రియ మెడ ప్రాంతంలోని అసౌకర్యాన్ని లక్ష్యంగా చేసుకుని, అవసరమైన ఉపశమనాన్ని అందిస్తుంది. పెయిన్ కిల్లర్స్ మెడిసిన్ అవసరాన్ని తగ్గిస్తుంది. మొత్తానికి మెడ నొప్పితో బాధపడే వ్యక్తులకు మెడికేషన్ ఫ్రీ లైఫ్‌స్టైల్‌ను ప్రసాదిస్తుంది. రోగనిర్ధారణ, లాంగ్ టర్మ్ మేనేజ్మెంట్ ఫేజ్‌లో భుజం నొప్పి నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తుంది. రోగులను సమగ్రంగా అంచనా వేయడంలో, దీర్ఘకాలిక నొప్పి నిర్వహణ వ్యూహాలను ఏర్పాటు చేయడంలో సాయపడుతుంది. పెయిన్ నుంచి రిలీఫ్‌ను అందించడమే కాకుండా.. ట్రాపెజియస్ కండరాలలో ఎక్కువ భాగాన్ని తగ్గించడం ద్వారా అందమైన హంస మెడను అందిస్తుంది. సన్నని భుజాలను కలిగి ఉండేలా చేస్తుంది.
అయితే పదేపదే ట్రాప్ టాక్స్ ఇంజెక్షన్లను ట్రాపెజియస్ వంటి పెద్ద కండరాలలో వినియోగించడం వల్ల బోటులినమ్ టాక్సిన్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీస్‌ను డెవలప్ చేస్తుంది. ట్రాపెజియస్‌లో మాత్రమే కాకుండా ముఖం వంటి ఇతర ప్రాంతాల్లో కూడా ఫ్యూచర్‌లో తీసుకునే ఇంజెక్షన్ల ఎఫెక్టివ్‌నెస్‌ను తగ్గించవచ్చు.
నిపుణుల ఆందోళన ఏంటి?
‘బార్బీ బొటాక్స్’ ఫాలో అయిన కొంతమంది తాత్కాలికంగా మాట్లాడటంలో, ఆహారం మింగడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమస్యలు సాధారణంగా వాటంతట అవే పరిష్కారమవుతాయి కానీ నిశితంగా పరిశీలించాలి. కానీ ఈ ప్రాబ్లమ్ నాలుగు నుంచి ఆరు నెలల మధ్య ఉంటుంది కాబట్టి ఇలాంటి అవాంతరాలు జీవితంలో మరిన్ని సమస్యలు ఎదుర్కొనేందుకు కారణం కావచ్చు. అంతేకాదు ట్రాప్ టాక్స్ మెడకు రెండు వైపుల ఉండే కండరాల అసమానతకు దారితీస్తుంది. ఇది పోస్చర్ మిస్‌అలైన్మెంట్‌కు దోహదపడొచ్చు. ఫిజికల్ థెరపీ, వ్యాయామాల ద్వారా కేర్‌ఫుల్‌గా మేనేజ్ చేయాలి. ఇక ‘ట్రాప్ టాక్స్’ కొన్ని సందర్భాల్లో కండరాల బలహీనతకు దారితీయవచ్చు. సాధారణ కదలికలను ప్రభావితం చేయొచ్చు. రోగులు ఈ రిజల్ట్ గురించి తెలుసుకుని.. తగ్గించడానికి హెల్త్ కేర్ ప్రొవైడర్స్ సహాయం తీసుకోవాలి. అరుదైన సందర్భాల్లో ముఖ్యంగా డిస్టోనియా వంటి నరాల సంబంధిత పరిస్థితులలో బోటులినమ్ టాక్సిన్ లార్జర్ డోసులను ఉపయోగించినప్పుడు.. కండరాల బలహీనత కలుగుతుంది. కాబట్టి కరెక్ట్ డోస్, వైద్య పర్యవేక్షణ ప్రాముఖ్యత గురించి చెప్తుంది. ఇతర మెడికల్ ప్రొసీజర్స్ మాదిరిగానే .. ‘ట్రాప్ టాక్స్’ చికిత్స చేసిన ప్రదేశంలో తేలికపాటి ఎరుపు, గాయాలు, నొప్పి, తిమ్మిరి, వాపు వస్తుంది. కానీ ఈ ప్రభావాలు సాధారణంగా కాలక్రమేణా తగ్గుతాయి.