బాలయ్య కుమారుడితో రాజమౌళి సినిమా.. పాన్ ఇండియా లెవెల్లో ఎంట్రీ..

by sudharani |   ( Updated:2023-12-23 10:51:32.0  )
బాలయ్య కుమారుడితో రాజమౌళి సినిమా.. పాన్ ఇండియా లెవెల్లో ఎంట్రీ..
X

దిశ, సినిమా: బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఏపీ ఎలక్షన్స్ తర్వాత ఇది జరగవచ్చనే టాక్ నడుస్తోంది. ఇక మోక్షజ్ఞ సినీ ప్రవేశంపై ఇప్పటికే ఎన్నో వార్తలు వినపడగా తాజాగా ఒక పాన్ ఇండియా డైరెక్టర్‌ను బాలయ్య లైన్‌లో పెట్టినట్లు న్యూస్ వైరల్ అవుతోంది. ఆ దర్శకుడు ఎవరో కాదు.. ఎస్.ఎస్ రాజమౌళి. ఈయనతో మోక్షజ్ఞ పాన్ ఇండియా సినిమా తీస్తే.. హీరోగా ఇండస్ట్రీలో లైఫ్ సెటిల్ అయిపోతాడనే ఆలోచనలో ఉన్నారట బాలయ్య.

అంతేకాదు కొడుకుతో మూవీ గురించి మాట్లాడేందుకు బాలయ్య.. రాజమౌళి ఇంటికి వెళ్లి మరీ మీట్ అయ్యారట. దీనికి రాజమౌళి కూడా ఒప్పుకున్నారని సమాచారం. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం మహేశ్ బాబు సినిమా పనుల్లో బిజీగా ఉన్న రాజమౌళి, మోక్షజ్ఞతో మూవీ ఎప్పుడు తెరకెక్కిస్తారని కొందరు అడుగుతున్నారు. ఎందుకంటే జక్కన్నతో సినిమా అంటే మామూలు విషయం కాదు, కానీ చూడబోతే మోక్షజ్ఞను రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బాలయ్య కంకణం కట్టుకున్నట్టుగానే అనిపిస్తోంది.

Advertisement

Next Story