- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కినేని ఇంట్లో జరగబోతున్న మూడు పెళ్లిళ్లు.. ఎవరెవరికంటే?
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున వారసులుగా నాగచైతన్య, అఖిల్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే సుమంత్, సుప్రియ, సుశాంత్ సినిమాల్లో నటిస్తున్నారు. అయితే వీరిలో పలువురికి పెళ్లిళ్లు అయి విచ్ఛిన్నం కూడా అయిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగచైతన్య, సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ నాలుగేళ్లలోనే మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెలిసిందే.
ఇక సుప్రియ కూడా తన భర్తకు విడాకులు ఇచ్చేసింది. నిర్మాతగా మారి సినిమాలు తెరకెక్కిస్తోంది. అలాగే అఖిల్ కూడా శ్రియా భూపాల్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. కొద్ది రోజుల్లో పెళ్లి అవుతుందని అనుకునే లోపే క్యాన్సిల్ చేసుకున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. ప్రజెంట్ వివాహ బంధం విచ్ఛిన్నం అయిన అఖిల్, సుప్రియ, నాగచైతన్యలు సినిమాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, వీరి విషయంలో నాగార్జున కీలక నిర్ణయం తీసుకున్నట్లు నెట్టింట పుకార్లు షికారు చేస్తున్నాయి.
నాగచైతన్య, అఖిల్, సుప్రియకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. వారి వ్యక్తిగత జీవితాలను దారిలో పెడితే సంతోషంగా ఉంటారని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒకేసారి అక్కినేని ఇంట్లో మూడు పెళ్లిళ్లు జరగబోతున్నాయని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఇక ఈ విషయం తెలిసిన వారు మూడు పెళ్లిళ్లపై అధికారిక ప్రకటన ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం అవన్నీ కొట్టిపారేస్తున్నారు.