ఆ తప్పుడు వార్తలు నా జీవితంపై ప్రభావం చూపిస్తున్నాయి.. చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్

by Hamsa |   ( Updated:2023-10-10 10:12:38.0  )
ఆ తప్పుడు వార్తలు నా జీవితంపై ప్రభావం చూపిస్తున్నాయి.. చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా స్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనను జీవితంలో ఒక్కసారైనా కలుసుకోవాలని కలలు కనేవారు ఎంతో మంది ఉన్నారు. అయితే ఇటీవల ఓ సీనియర్ జర్నలిస్ట్ తాను రాసిన పుస్తకాన్ని చిరంజీవి చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ ఆవిష్కరణ లో భాగంగా చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి సినీ రచయితలతో, జర్నలిస్టులతో నాకు ఎంతో మంచి అనుబంధం ఉంది. కలం ద్వారా జర్నలిస్టులకు ఎంతో మంచి గుర్తింపు ఉంటుంది. వారి పవర్ మొత్తం ఆ పెన్నుతో రాసే రాతలోనే ఉంటుంది. ఇక వీరు ఈ పెన్నుతో రాసేవి కొన్ని నిజాలు అయితే మరికొన్ని అబద్ధాలు అవుతాయి. కానీ కొంతమంది మాత్రం ఎదుటి వాళ్ళు బాధ పడే విధంగా తప్పుడు వార్తలు రాస్తూ ఉంటారు. ఇక ఇలాంటి పరిస్థితి నేను కూడా ఎదుర్కొన్నాను. ఇక వాళ్లు రాసిన తప్పుడు వార్తలు నా జీవితంలో నేను మర్చిపోలేను. ఆ తప్పుడు వార్తలు జీవితంపై ప్రభావం చూపిస్తున్నాయి’’ అంటూ చెప్పుకొచ్చారట. ప్రస్తుతం చిరంజీవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

Next Story