OTT Movie : ఈ సైకో కిల్లర్ కలలోనే తన పని కానిస్తాడు.. ఈ మూవీ ఎక్కడ చూడొచ్చంటే..?

by Prasanna |   ( Updated:2024-07-21 09:11:18.0  )
OTT Movie : ఈ సైకో కిల్లర్ కలలోనే తన పని కానిస్తాడు.. ఈ మూవీ ఎక్కడ చూడొచ్చంటే..?
X

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు థియేటర్ కన్నాఓటీటీ సినిమాలు చూడటానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. స్టార్ హీరో సినిమాలు అయితే తప్ప ఇతర సినిమాలు చూడటం లేదు. కథ బావుంటే రెండు మూడు సార్లు వెళ్లి చూస్తున్నారు. ఓటీటీలో సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ మూవీస్ నే హిట్ అవుతున్నాయి. తాజాగా ఓటీటీలో రిలీజ్ అయినా మూవీ దూసుకెళ్తుంది. ఈ మూవీ చూసిన వాళ్ళు కూడా భయంతో వణికి పోతున్నారు. ఇది చూస్తున్నంత సేపు కలకి, రియాలిటీకి తేడా కూడా తెలియకుండా ఉంటుంది.

‘ది నైట్ మెర్ ఆన్ ఈఎల్ఎమ్ స్ట్రీట్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.ఇక కథ గురించి మాట్లాడుకుంటే ఒక రెస్టారెంట్ కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు డీన్ అనే ఒక విద్యార్థి మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు. అప్పుడు కలలో శరీరం మొత్తం కాలిపోయిన మనిషి అతన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. ఒక్క క్షణం రియాలిటీలో రాగానే తనకు తనే కత్తితో పొడుచుకుని చంపుకుంటాడు. కొంతసేపటికి ఇంకో స్టూడెంట్ కి ఇలాగే జరుగుతుంది. అక్కడున్న వారికి ఏం జరుగుతుందో అర్ధం కాదు.. ఆ కాలిన వ్యక్తి ఎవరు? ఎందుకు అందర్ని చంపుతున్నాడు.. నిద్రపోయిన వారినే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో తెలియాలంటే “ది నైట్ మెర్ ఆన్ ఈఎల్ఎమ్ స్ట్రీట్” ను ఒకసారి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed