Mr Bachchan: 'మిస్టర్ బచ్చన్' నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్.. అట్రాక్షన్‌గా రవితేజ, భాగ్యశ్రీ బ్యూటీఫుల్ కెమిస్ట్రీ

by sudharani |
Mr Bachchan: మిస్టర్ బచ్చన్ నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్.. అట్రాక్షన్‌గా రవితేజ, భాగ్యశ్రీ బ్యూటీఫుల్ కెమిస్ట్రీ
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ గ్రాంగ్‌గా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా ఆగస్టు 15న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక రిలీజ్ సమయం కూడా దగ్గర పడటంతో వరుస అప్‌డేట్స్‌తో ప్రేక్షకులకు మాస్ ట్రీట్ ఇస్తున్నారు మేకర్స్. ఇక ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన టీజన్, పోస్టర్లు ఆకట్టుకోగా.. రెప్పల్ డెప్పల్ సాంగ్‌కు సోషల్ మీడియాలో విశేషస్పందన లభించింది.

ఇప్పుడు ఇందులో నుంచి థర్డ్ సింగిల్ ‘జిక్కీ’ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘నిన్ను చూసి గుండె ఒట్టు పెట్టు కున్నదే.. గట్టు దాటి గట్టిగానే కొట్టుకున్నదే.. ఎవరున్నారే నీకన్నా లక్కీ..’ అనే లిరిక్‌తో సాగే ఈ సాంగ్.. వండర్ ఫుల్ మ్యూజిక్‌తో రొమాంటిక్ అండ్ మెలోడీయస్‌గా మెస్మరైజ్ చేస్తుంది. ఇక ఇందులో రవితేజ, భాగ్యశ్రీ బ్యూటీఫుల్ కెమిస్ట్రీని అట్రాక్షన్‌గా నిలిచింది. విడుదలైన కొద్ది సేపటికే మంచి వ్యూస్‌తో సోషల్ మీడియాలో షేక్ చేస్తుంది ఈ సాంగ్.


Advertisement

Next Story

Most Viewed