వాళ్లకు ప్రెగ్నెన్సీలు అవుతున్నాయి.. నేను మాత్రం ఇంకా పర్మిషన్ తీసుకుంటున్న: అనుపమ పోస్ట్

by sudharani |   ( Updated:2023-11-23 13:11:45.0  )
వాళ్లకు ప్రెగ్నెన్సీలు అవుతున్నాయి.. నేను మాత్రం ఇంకా పర్మిషన్ తీసుకుంటున్న: అనుపమ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘అఆ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. నెట్టింట ఈ అమ్మడు చేసే అల్లరి, ఫొటోస్ షూట్‌లతో చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇక అనుపమ ఏ పోస్ట్ పెట్టిన క్షణాల్లో వైరల్ కావడంతో పాటు.. ఫన్నీ మీమ్స్, ట్రోల్స్‌తో సందడి చేస్తారు నెటిజన్లు.

ఈ క్రమంలోనే నెట్టింట్ మరోసారి వైరల్ అవుతోంది క్యూట్ బేబీ. ఈ మేరకు అనుపమ ‘‘నా ఏజ్ ఉన్న కొందరు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మరికొందరు ప్రెగ్నెంట్ అవుతున్నారు. కానీ నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలి అన్నా పర్మిషన్ తీసుకుంటున్న’’ అంటూ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Advertisement

Next Story