ఇన్ని సర్ ప్రైజ్ లు ఏంటి స్వామి.. కల్కిలో కనిపించే మరో ఐదుగురు వీరే.. తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

by Prasanna |   ( Updated:2024-06-27 04:48:43.0  )
ఇన్ని సర్ ప్రైజ్ లు ఏంటి స్వామి.. కల్కిలో  కనిపించే మరో ఐదుగురు వీరే.. తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!
X

దిశ, సినిమా : నేడు కల్కి మేనియా కొనసాగుతోంది. ఈ రోజు రిలీజ్ అయినా ఈ చిత్రానికి ఉదయం నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ముఖ్యంగా ఉత్తరాదిలో కల్కి ఎవరూ ఊహించని విధంగా సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం కల్కి 2898 AD ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. కాశీ, కాంప్లెక్స్, శంబల అనే మూడు లోకాలను పరిచయం చేస్తూ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన అద్భుత మాయ మూవీకి ఉదయం నుంచి ఎక్కడా చూసిన ఒకటే మాట విపినిపిస్తుంది.. అన్న మళ్లీ గట్టిగా కొట్టబోతున్నాడంటూ.. ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇందులో కమల్ హాసన్, అమితాబ్, దీపికా, శోభన, దిశా పటానీ, మాళవిక నాయర్ నటించనున్నట్లు ముందే ప్రకటించారు. అయితే ఇప్పుడు సినిమాలో మరో ఐదుగురు ఉన్నారు. కాకపోతే, వారిని ముందే రివీల్ చేయలేదు.

తాజాగా ,ఈ మూవీలో వారందరినీ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మృణాల్, దర్శకుడు రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, అనుదీప్ కెవి, ఫరియా అబ్దుల్లా కనిపించారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ ని చూసి అందరూ షాక్ అయ్యారు. ఇన్ని సర్ ప్రైజ్ లు ఏంటి స్వామి..అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed