అక్కడ కోటి, ఇక్కడ మూడు కోట్లు.. భారీగా డిమాండ్ చేస్తున్న జాన్వీ?

by samatah |   ( Updated:2023-06-29 08:47:36.0  )
అక్కడ కోటి, ఇక్కడ మూడు కోట్లు.. భారీగా డిమాండ్ చేస్తున్న జాన్వీ?
X

దిశ, సినిమా: శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో అడుగు పెట్టి చాలా కాలమైంది. కానీ, ఇప్పటివరకు భారీ విజయం మాత్రం అందుకోలేకపోయింది. సోషల్ మీడియాలో అందాలు అరబోయడంలో ఉన్న శ్రద్ధ.. కెరీర్‌పై చూపించలేకపోయింది. ఇకపోతే జాన్వీ కపూర్ పారితోషికంపై తాజాగా కొన్ని వార్తలు వినపడుతున్నాయి. ఇప్పటి వరకు ఆమె నటించిన ఓటీటీ సినిమాలు, సిరీస్‌‌ల‌కు కోటి నుంచి రెండు కోట్లు పారితోషికం అందుకుంది. అయితే తెలుగు సినిమాలో నటించేందుకు నాలుగు కోట్లు డిమాండ్ చేస్తుందట. ఎన్టీఆర్‌తో నటిస్తున్న ‘దేవర’ హిట్ అయితే సౌత్‌లో మూడునుంచి నాలుగు కోట్లు ఇచ్చేందుకు నిర్మాతలు కూడా ఓకే చెప్పే అవకాశాలున్నాయని టాక్ నడుస్తోంది.

Read More: ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లు వీళ్లే

Advertisement

Next Story