ఆ హీరోను మించిన యాక్టర్ ఇండియాలో లేడు.. మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్

by Hamsa |   ( Updated:2023-11-28 05:59:54.0  )
ఆ హీరోను మించిన యాక్టర్ ఇండియాలో లేడు.. మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా చిత్రం ‘యానిమల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ యూనివర్సిటీలో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి, మల్లారెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, రష్మిక, రణ్‌బీర్ లతో వీళ్లు ఫొటోలకు పోజులిచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘రణ్‌బీర్ కపూర్ కి తాను వీరాభిమానినని, ఇండియాలో బెస్ట్ యాక్టర్ అతడే అని మహేష్ బాబు అనడం గమనార్హం. గతంలో తాను అదే మాట రణ్‌బీర్ కు చెప్పిన అతడు పెద్దగా పట్టించుకోలేదని, ఇప్పుడు మరోసారి చెబుతున్నానని మహేష్ అన్నారు. అలాగే యానిమల్ ట్రైలర్ చూసి మెంటలొచ్చేసిందంతే అని చెప్పారు. ఇక రణబీర్ కూడా తాను కలిసిన తొలి సూపర్ స్టార్ మహేష్ బాబు అని ఆయన నటించిన ఒక్కడు మూవీ చూశానని చెప్పారు. కాగా, యానిమల్ చిత్రాన్ని డైరెక్టర్ సందీప్ తెరకెక్కించగా.. రష్మిక, రణబీర్ జంటగా నటిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 1న థియేటర్స్‌లోకి రాబోతుంది.

Advertisement

Next Story