- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈ చిన్న కారణం వల్ల చిరంజీవితో 20 ఏళ్లు మాట్లాడటం మానేసిన స్టార్ హీరోయిన్..!
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన సినీ కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్ల సరసన నటించారు. కొంతమంది హీరోయిన్లతో రిపీటెడ్‌గా కూడా సినిమాలు చేశారు. అందులో విజయశాంతి ఒకరు. వీరిద్దరి కాంబోలో మూవీ వస్తుందంటే ప్రేక్షకులకు పండగే. నటన, డ్యాన్స్, యాక్షన్, డ్రామా, కామెడీ సీన్స్.. ఇలా అన్నింటిలోనూ చిరు, విజయశాంతి నువ్వా నేనా అన్నట్లు చేసేవారు. అప్పట్లో ‘గ్యాంగ్ లీడర్’ షూటింగ్ సమయంలో వీరిద్దరు మాట్లాడుకోవడం లేదని నెట్టింట ప్రచారం జరిగింది. అయితే తాజాగా విజయశాంతి ఓ ఇంటర్వ్యూలో హాజరై అసలు నిజాన్ని బయటపెట్టారు.
‘తెలంగాణ ఉద్యమం సమయంలో సినిమా పరిశ్రమ నుంచి ఈ హీరోయిన్ సపోర్ట్ కోరాను. కానీ ఎవరూ ముందుకు రాలేదు. నాతో ఎంతో మంచి సన్నిహిత్యం ఉన్న చిరంజీవి కూడా ఎలాంటి మద్దతు ఇవ్వకపోవడంతో చిరుతో మాట్లాడడం మానేశాను. మళ్లీ ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కలిశాము. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా చిరంజీవి వచ్చాడు. ఈ కార్యక్రమంలోనే మా ఇద్దరి మధ్య మళ్లీ మాటలు కలిశాయి.’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
Also Read..
Bhola Shankar సినిమాలో పవర్ స్టార్.. లీక్ చేసిన మెగాస్టార్ (వీడియో)